17-01-2026 03:39:17 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకరమైన ప్రచారం, ట్రో లింగ్‌పై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కన్నెర్ర చేశారు. తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న 73 మందిపై ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చే శారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న దాడిని అనసూయ తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తన ముఖాన్ని వేరే వీడియోలకు మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం వ్యూస్ కోసం, లైకుల కోసం తన పరువు తీసేలా థంబ్నెయిల్స్ పెడుతున్నారని, ఇది తన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనసూయ సమర్పించిన ఫిర్యాదులో మొత్తం 73 సోషల్ మీడియా ఖాతాలు, వ్య క్తుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనను వేధిస్తున్న వారి లింకులను పోలీసులకు అందజేశారు. నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాను.
కానీ నా మౌనాన్ని చేతకానితనం గా భావిస్తున్నారు. అందుకే చట్టపరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను.. అని అనసూయ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అన సూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు. మహిళల పట్ల ఆన్‌లైన్‌లో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.