24-05-2025 12:00:00 AM
యువ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజాచిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘కేసీఆర్’ ఫేమ్ రాకింగ్ రాకేశ్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్రా శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ దర్శక త్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సంగీతం: శశాంక్ తిరుపతి; డీవోపీ: ప్రేమ్‌సాగర్.