24-05-2025 12:00:00 AM
‘కౌసల్యా కృష్ణమూర్తి’, ‘అథర్వ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో కార్తీక్ రాజు మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరామకృష్ణ సినిమా బ్యానర్‌పై గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ.. ‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యం, ఎమోషనల్ చిత్రం. 1980లో వరంగల్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతీ, శ్రీధర్‌రెడ్డి, ప్రభావతి, అభయ్, ఫణి, పద్మ, కీర్తిలత తదితరులు వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బలి; గీత రచయిత: కాసర్ల శ్యామ్; కెమెరా: గంగానమోని శేఖర్; ఆర్ట్: రవికుమార్ గుర్రం.