07-09-2025 12:25:49 AM
కోదాడ, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): మద్యం మత్తులో ఘర్షణకు దిగిన ఇరువర్గాలను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై ఇనుప రాడ్డుతో దాడికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్తున్న ఓ వర్గానికి ఎదురుపడిన ఓ పార్టీకి చెందిన ఆరుగురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. మాటామాట పెరిగి ఇనుప రాడ్లతో దాడి చేసుకుంటుండగా కానిస్టేబుల్ ఓరుగంటి నరేష్ మధ్యలో వెళ్ళాడు. ఈ క్రమంలో ఓ నాయకుడు విక్షచణనకోల్పోయి రాడ్డుతో కానిస్టేబుల్ తలపై దాడి చేశాడు.
తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థితిలో పడి ఉన్న కానిస్టేబుల్‌ని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించాడు.