calender_icon.png 7 September, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక లడ్డూ వేలం పాట

06-09-2025 08:45:25 PM

పటాన్ చెరు,(విజయక్రాంతి): వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామం గణేష్ గడ్డలో స్వయంభుగా వెలసిన సిద్ధి వినాయక ఆలయంలో గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన శనివారం వినాయకుడి మూడు లడ్డూలను వేలంపాట వేశారు. వేలంపాటలో మొదటి లడ్డును తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు సాయి చరణ్ గౌడ్ రూ.7 లక్షలకు దక్షించుకున్నారు.

రెండవ లడ్డును రామచంద్రాపురం పట్టణానికి చెందిన వరుణ్ రూ.3 లక్షల 40 వేలకు దక్కించుకున్నారు. మూడవ లడ్డు రుద్రారం గ్రామానికి చెందిన పట్నం రామారావు రూ.2 లక్షల 50 వేలకు దక్కించుకున్నారు. వేలంపాటలో వినాయకుడి లడ్డూను దక్కించుకున్న భక్తులకు ఆలయ సిబ్బంది శ్రీ సిద్ధి గణపతి స్వామి వారి దర్శనం చేయించి, వారిని సన్మానించి లడ్డూలను అందజేశారు. స్వామివారి లడ్డును దక్కించుకోవడంతో ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. వినాయకుడి కృప ఆశీస్సులతో తమ కుటుంబం సభ్యులతో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు తెలిపారు.