calender_icon.png 2 September, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి

02-09-2025 12:07:12 AM

పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): జిల్లాలో ఈనెల 4, 6వ తేదీల్లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవన్ని శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా,  ఎస్పీ అఖిల్ మహాజన్ ను ప్రజలకు సూచించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమన్వయం తో పనిచేసి ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం ప్రక్రియ విజయవంతం చేయాలనీ ఆన్నారు.వినాయక నిమజ్జనం పై ఫీస్ కమిటి సభ్యులు, సంబధిత శాఖ అధికారులతో సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లు మాట్లాడుతూ ఈనెల 4, 6 తేదీలలో నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా సంబంధిత శాఖలన్ని సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా, పూర్తి జాగ్రత్తలు, భద్రతా చర్య లు, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. నిమజ్జనం పూర్తయ్యేంత వరకూ అధికారులంతా హై అలర్ట్ లో ఉండాలని తెలిపారు.

మున్సిపల్, పంచాయితీ, R&B, ఎక్సై జ్, విద్యుత్ శాఖలు సంబంధిత మరమ్మత్తు పనులు, రహదారులపై గుంతలు పూడ్చడం, వాటర్, విద్యుత్ సదుపాయాలు పర్యవేక్షించడం, మండపాల వద్ద ప్రత్యేక శ్రద్ధ, శుభ్రత, భద్రతా చర్యలపై దృష్టి సారించాలన్నారు. ఎక్సైజ్ శాఖ ఈనెల 4, 6వ తేదీల్లో మద్యం షాపులు పూర్తిగా మూసివేయాలనిఎక్కడా మద్యం లభించకుండా ఎక్సైజ్ అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

నిమజ్జనం చోట భద్రతా ఏర్పాట్లు క్రే న్లు, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, అంబులెన్స్, గజ ఈతగాళ్లు, అవసరమైతే NCC టీమ్‌లను రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని, ప్రతి ఒక్కరు సం యమనం పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సలోని, ఆర్డీఓ స్రవంతి, జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.