calender_icon.png 2 September, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపీఎస్ అమలు చేయాల్సిందే

02-09-2025 12:07:48 AM

టీజీ జేఏసీ చైర్మన్ రాజీవ్ రెడ్డి 

మహబూబ్ నగర్ టౌన్ సెప్టెంబర్ 1 : ఎట్టి పరిస్థితుల్లో ఓపిఎస్ అమలు చేయవలసిందిగాని టీజీ జెఎసి చైర్మన్ రాజీవ్ రెడ్డి డి మాండ్ చేశారు. సోమవారం టీజీ జేఏసీ ఆ ధ్వర్యం లో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా న లుపు దుస్తులు ధరించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగికి సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ను అమలు చేయాల్సి ఉందని మొరపెట్టుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ కపోవడం సరికాదన్నారు.

ఇప్పటికైనా పాత పెన్షన్ విధానం అమలు చేసేలా అవసరమై న చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీ జెఎసి నేత, టీజీఓ విజయ కుమార్, టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రా నాయక్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్,సభ్యులు నంద కిషోర్, రాజేష్,  తదిత రులు ఉన్నారు.