02-09-2025 12:06:02 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతికి పూర్తిగా బీఆర్‌ఎస్ బా ధ్యత వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలపై మొ దటి నుంచే తాము సీబీఐ విచారణ కోరుతున్నా... కాంగ్రెస్ సర్కారు మాత్రం బీఆర్ఎస్‌ను కాపాడుతూ వచ్చిందన్నారు.
ఫలితంగా అవినీతికి బాధ్యులైన వారిపై చర్యలు ఆలస్యం అయ్యేలా చేసింది కాంగ్రెస్ సర్కారేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. గత్యం తరం లేని పరిస్థితుల్లోనే ఇప్పుడు నిజానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు అంగీకరించాల్సి వచ్చిందన్నారు.
కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐకి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలోనూ కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్‌ఆర్ టోల్ టెండర్లపై సిట్ ను ప్రకటించినా నేటికీ అది ఆచరణ రూపం దాల్చలేదన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికీ డైలీ సీరియల్‌లా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.