04-09-2025 12:00:00 AM
సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి
కరీంనగర్, సెప్టెంబరు 3 (విజయ క్రాంతి): గణేష్ విగ్రహాలు నిమజ్జనానికై తర లి వెళ్తున్న క్రమంలో రోడ్లలో గుంతలు పూ డ్చే పనులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిమ జ్జన ప్రాంతాలలో చదును చేసి మొరం, డస్ట్ పోయడానికి సిసి రోడ్డు లలో కూడా గుంత లు పూడ్చడానికి మున్సిపల్ సాధారణ నిధుల నుండి అత్యవసరంగా టెండర్లు పిలిచి కే టాయించిన 60 లక్షల 75 వేల రూపాయలతో విద్యానగర్ శ్రీరాంనగర్ కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ యం తక్కువ ఉన్నందున రాత్రి పగలు అని చూడకుండా వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకుసూచించారు.