03-09-2025 11:40:29 PM
చుంచుపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం బ్రిడ్జిపై గోతులు పడి నెలల గడుస్తున్న, ప్రజలు నానా ఇబ్బంది పడుతున్న పట్టించుకోని అధికారులు, రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హడావుడిగా గోతులు పోర్చటం గమనార్హం. అనేకమంది వాహనచోదకులు గోతుల్లో పడి గాయాలపాలైన పట్టించుకోని అధికారులు మంత్రులు వస్తున్నారంటే హడావుడి చేయటమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్య పరిష్కారం కావాలంటే మంత్రులు, ముఖ్యమంత్రుల పర్యటనలతో పరిష్కారం అవుతుందా అంటూ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.