24-10-2025 12:24:20 AM
శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూతన నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. నిందితుల వద్ద నుంచి మారుతి స్వీఫ్ట్ కారు, బజాజ్ పల్సర్ బైకు నాలుగు లక్షల విలువైన విద్యుత్ వైర్లు 81 బేండల్స్ ను స్వాధీనం చేసుకున్నారు మియాపూర్ పోలీసులు.
అందుకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీహార్ కు చెందిన దీలిప్ కుమార్ (35) హఫీజ్ పేటలోని మార్తాండ నగర్ లో నివాసం ఉంటున్న నిశాల్ కరల్కర్ (28)లు స్నేహితులు.జల్సాలకు,చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కొరకు నిర్మాణంలో ఉన్న భవనల్లో పగలు రెక్కీ నిర్వహించి రాత్రి పుట కారులో వెళ్లి అక్కడ నిలువ చేసిన విద్యుత్ వైర్లు, గృహపకరణాలకు అవసరమైన సామాగ్రిని ఎత్తుకెళ్ళి స్క్రాప్ దుకాణాలు అమ్ముకుని సొమ్ము చేసుకునే వారన్నారు.
నిందితులపై గతంలో ఎనిమిది కేసులు మియాపూర్ లో మూడు కేసులు మొత్తం 11 కేసులు ఉన్నాయని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమని పోలీసులు తెలిపారు.ఈ సమావేశంలో మియాపూర్ సిఐ శివప్రసాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు,డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.