24-10-2025 12:24:01 AM
ఓబీసీ మోర్చా రాష్ర్ట ఉపాధ్యక్షుడు సురేందర్ యాదవ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గోరక్షకులపై దాడి చేసిన ఎంఐఎం నాయకుడు, అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఎక్కడి కక్కడ బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని, ఓబీసీ మోర్చా రాష్ర్ట ఉపాధ్యక్షులు చింతల సురేందర్ యాదవ్‌తో సహా అనేకమంది బిజెపి నేతలను కార్యకర్తలను గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా చింతల సురేందర్ యాదవ్ మాట్లాడుతూ.. “గోమాత రక్షణ కోసం కృషి చేసే గోభక్తులపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఇలాంటి సంఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా స్పందించాలి. లేకపోతే రాష్ర్టవ్యాప్తంగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుం ది” అని హెచ్చరించారు. అరెస్టయిన వారి లో బీజేపీ నాయకులు బద్దం బాలకృష్ణగౌడ్, బీజేవైఎం నాగోల్ డివిజన్ అధ్యక్షుడు వినోద్ యాదవ్, సంతోష్ కుమార్, మనోజ్ కుమార్, శివకుమార్ ఉన్నారు.