11-05-2025 12:25:00 AM
-విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి
యాచారం మే 10 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నా రు. శనివారం యాచారం మండలం, మల్కి స్ గూడా గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో ఎల్లమ్మ మార్క మ్మ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి విచ్చేసి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, యజ్ఞంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్క రూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని అన్నారు. రూ.60 లక్షలతో ఆలయాలను నిర్మించిన గ్రామస్తు లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్కు నరసింహ, గజ్జె రామకృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.