20-10-2025 12:00:00 AM
నిద్రావస్థలో గ్రామ పంచాయతీ అధికారులు
మనోహరాబాద్, అక్టోబర్ 19 :మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళకల్ లో వీధులన్ని పూర్తిగా చెత్తతో దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి పందులు, కుక్కలు స్త్వ్రర్యివిహారం చేస్తున్నాయి. ఇలావుంటే రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు వాపోయారు. అసలే కాళ్ళకల్ ప్రాంతం పరిశ్రమలతో వ్యాపించి ఉండడంతో వాయు కాలుష్యం,
నీటి కాలుష్యం పెరిగి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చెత్తాచెదారంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు.. చెత్త విషయమై పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు చెత్తపై చర్యలు తీసుకొని శుభ్రత వైపు అడుగులు వేయాలని గ్రామవాసులు కోరుతున్నారు.