21-05-2025 12:41:05 AM
దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించిన తాజాచిత్రం ‘23’తో మరో విజయాన్ని అం దుకున్నారు. ఇందులో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. మే 16న రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాజ్ మాట్లాడుతూ.. “23’ సినిమాకు రావలసిన సపోర్ట్, ఆదరణ కంటే ఎక్కువే వచ్చాయి. ఒక మూవీ సక్సెస్‌కు చాలా పారామీటర్స్ ఉంటాయి. ఈ సినిమా ఛాలెంజింగ్ అని తెలుసు. ఇలాంటి సినిమాతో స్ఫూర్తి పొంది ఇలాంటి కథలు మరొకరు తీస్తారనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అందుకే ఇలాంటి ప్రయోగం చేశాం.
ప్రేక్షకులు ఆదరించారు.. అదే మా సక్సెస్’ అన్నారు. హీరో తేజ మాట్లాడుతూ.. ‘ఒక డెబ్యు యాక్టర్‌గా నాకు ఇంత మంచి ఇంటెన్స్ స్టోరీ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. సాధారణంగా పదేళ్ల తర్వాత రావాల్సిన రోల్ ఇది. కానీ నాపై నమ్మకంతో ఈ పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్న డైరెక్టర్ నా జీవితానికో నమ్మకాన్నిచ్చారు. ఆయన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా’ అన్నాడు. ‘తొలి సినిమాకే ఇలాంటి మంచి క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు’ అని హీరోయిన్ తన్మయి తెలిపింది.