21-05-2025 05:09:15 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం నాయకురాలు ములకలపల్లి కుమారి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు అన్నారు.
బుధవారం నాడు కొక్కిరేణి గ్రామంలో ములకలపల్లి కుమారి పార్థివదేహంపై పూలమాల వేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మార్క్సిస్టు పార్టీ జిల్లా నాయకుడు మలకలపల్లి రాములు సహధర్మచారిణిగా ఐద్వా నాయకురాలిగా ఈ ప్రాంత ప్రజల సమస్యలపై స్పందించి వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతు సహకారం అందించిన కుమారి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని ఆమె మృతికి విప్లవ జోహార్లు అనిపిస్తూ తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జోహార్లు అర్పించిన వారిలో తెలంగాణ వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు మునగాల మండల సిపిఐ కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెంకటయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు పరికె భరత్ అన్నారు.