21-05-2025 04:47:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): దేవి అహల్యా బాయి హోల్కర్(Ahalya Bai Holkar) జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్ పట్టణంలోని దేవరకోట ఆలయంలో బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ధార్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి, హిందూ ఆలయాలను పరిరక్షించిన దేవి అహల్యా బాయి హోల్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని అహల్యా బాయి హోల్కర్ జయంతి వేడుకల జిల్లా కన్వీనర్ అలివేలు మంగ, బీజేపీ నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ సూచించారు.
అహల్య భాయ్ హోల్కర్ జయంతి వేడుకల సందర్భంగా బుదవారం నిర్మల్ పట్టణంలోని దేవర కోట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయా అర్చకులను సన్మానించారు. ఈ సందర్భంగా వడ్లకొండ అలివేలు మంగ గారు భక్తులకు అహల్య భాయ్ హోల్కర్ జీవిత చరిత్ర గురించి సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కేంద్ర టెలికామ్ బోర్డు సభ్యులు బుర్ర రమేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండాజి శ్రావణ్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షులు రజినీ వైద్య, బీజేపీ సీనియర్ నాయకులు వడ్ల కొండ వెంకట పతి, కూచన పల్లి లత, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.