21-05-2025 05:01:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవులలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించుటకు రాష్ట్ర పరిశీలకులు రామకృష్ణ(State Observers Ramakrishna) బుధవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలో శిక్షణ కార్యక్రమం జరుగుచున్న తీరును అభినందిస్తూ, విద్యార్థులలో అభ్యసన ఫలితాలు సాధించుటకు ఉపాధ్యాయుల కృషి చేయాలని, ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు చక్కగా వినియోగించుకొని జీవశాస్త్ర బోధనలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా జీవ శాస్త్ర ఫోరం తరుపున రాష్ట్ర పరిశీలకులు రామకృష్ణని సన్మానించారు. జిల్లా జీవ శాస్త్ర ఫోరం అధ్యక్షులు సత్తెన్న, ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుష్మారాణి, గౌరవ అధ్యక్షులు మోహన్ రావు, రిసోర్స్ పర్సన్స్ గంగా సురేష్, సుభాష్, బాలకృష్ణ, విజయ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.