27-04-2025 09:01:11 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి బిజెహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఘనవిభూతి శ్రీనివాస్ ను నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. బేడ బుడగ జంగాల భావితరాల కోసం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం బేడ బుడగ జంగాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడ్డ గుమ్మెట తంబురామోత, బీడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి కమిటీలో గత 15 సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ సంఘ శ్రేయస్సుకు పాటుపడుతూ, కుల సేవకు అంకితమై పనిచేస్తూ సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విభూతి శ్రీనివాస్ కు పదవి అప్పగించినట్లు రాష్ట్ర కమిటీ నియామక పత్రం జారీ చేసింది. ఇట్టి నియామకం రెండు సంవత్సరాల వరకు కొనసాగుతుందని కమిటీ తెలిపింది.