25-07-2025 12:00:00 AM
రామచంద్రపురం, జూలై 24: రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్త్మ్రల్‘ కార్యక్రమాన్ని పటాన్చెరు నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి ఆకాశం ఓర్ఫనేజ్ ట్రస్ట్ సహకారంతో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ చేశారు.
అలాగే 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతులుగా రూ.4000, రూ.3000, రూ.2000లను ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య అందజేశారు. కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్, నాయకులు పాల్గొన్నారు.