04-07-2025 12:00:00 AM
శుభ్‌మన్‌గిల్ (269)
న్యూఢిల్లీ, జూలై 3: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ (269) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ గడ్డపై ద్విశతకం సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
బర్మింగ్‌హమ్ వేదికగా జరగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. గిల్ 269 పరుగులు చేయగా.. జడేజా (89), జైస్వాల్ (87) శతకాలు చేజార్చుకున్నారు. ఆల్‌రౌండర్ సుందర్ 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీ యగా.. వోక్స్, జోష్ టాంగ్ చెరో 2 వి కెట్లు పడగొట్టారు.
భారత జోరు చూస్తే 600 పరుగులు పక్కాగా చేస్తుందని అనిపించినప్పటికీ చివర్లో ఇంగ్లి ష్ బౌలర్లు వి జృంభించడంతో భారత్ ఇన్నిం గ్స్ 587 ప రుగుల వద్ద ముగిసింది. అనంతరం తొలి ఇ న్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ౨౦ ఓవర్లలో ౩ వికెట్ల నష్టానికి ౭౭ పరుగులు చేసింది. రూట్ (౧౮*), బ్రూక్ (౩౦*) క్రీజులో ఉన్నారు.