03-07-2025 07:20:37 PM
ఇండియా vs ఇంగ్లాండ్: భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో 200 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో శుభ్‌మాన్ గిల్ కి తొలి డబుల్ సెంచరీ, అలాగే ఇంగ్లాండ్ గడ్డపై ఒక భారత కెప్టెన్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. గిల్‌తో పాటు, వాషింగ్టన్ సుందర్(Washington Sundar) కూడా అద్భుతమైన ఆట ఆడుతూ బౌండరీలు బాదుతున్నాడు. 89 పరుగుల వద్ద రవీంద్ర జడేజా అకస్మాత్తుగా ఔటైయ్యాడు. ప్రస్తుతం భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది. మరోవైపు, ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్, అతని సహచరుడు ఆటలో తిరిగి పుంజుకోవడానికి వికెట్ల కోసం తీవ్రంగా చూస్తున్నాడు.