calender_icon.png 12 December, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోలోన.. ఓల్డే‘నయా’్య!

12-12-2025 01:15:24 AM

  1. అధికారులకు తెలియకుండానే.. ఎంవోయూలు!
  2. విద్యుత్ శాఖలో తీవ్ర చర్చలు
  3. విజయక్రాంతి’ కథనంతో సంచలనం
  4. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే పెట్టుబడుల వ్యవహారాలు
  5. పాత పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై.. కొత్త ఒప్పందాలు
  6. విద్యుత్ శాఖలో, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో తీవ్ర చర్చలు

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ‘..అవే పాత ప్రాజెక్టులు.. పాత కంపెనీలు.. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. ఇవన్నీ నిజమే అని ‘విజయ క్రాంతిదినపత్రికలో వచ్చిన కథనంతో బ యటపడింది. అసలు ఒప్పందాలు ఎవరి తో, ఏయే కంపెనీలు.. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయనే విషయమే ఎవరికీ తెలి యదు.

అంతా పెద్దల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.. శాఖలో ఉన్నతాధికారులకుకూ డా ఎంవోయూలపై సమాచారం లేదు..’ అంటూ తెలంగాణ విద్యుత్ శాఖలో తీవ్ర చ ర్చ జరిగింది. గురువారం ‘విజయక్రాంతి’ పత్రికలో వచ్చిన ‘గ్లోబల్ సమ్మిట్‌లో హస్తవాసి’ కథనం తెలంగాణ విద్యుత్ శాఖలో, ముఖ్యంగా జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలోని ఉద్యోగులు, అధికారుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

అధికారులకు తెలియదు.. 

తాజాగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌ెే2025లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి పలు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే ఇం దులో ఐదు కంపెనీలు, 7,150 మె గావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న ఐదు ప్రాజెక్టులు.. వాస్తవానికి ఎప్పుడో 2020 నుంచి ప్రతిపాదనల స్థాయిలో ఉన్నాయి. అదే ఐదు కంపెనీలు డెవలపర్లుగా సీఈఏ వెబ్‌సైట్‌లోనూ నమోదయ్యాయి.

అంటే పాత ప్రాజెక్టులు.. పాత కంపెనీలే.. కొత్తగా ప్రభుత్వంతో ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్టుగా ప్రకటించడంపై విద్యుత్ శాఖలో ఉద్యోగులు, అధికారుల్లో చర్చ జరిగింది. ప్రభుత్వం ఏయే ప్రాజెక్టులపై.. ఏయే కంపెనీలతో ఏ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయనేదానిపై..

వాస్తవానికి వి ద్యుత్ శాఖలో.. ముఖ్యంగా తెలంగాణ జెన్‌కోలోని ఉన్నతాధికారులకు కూడా ఎలాం టి సమాచారమూ లేదంటూ ఉద్యోగులు, అధికారుల మధ్యన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కనీసం ఒ ప్పందం కుదుర్చుకునే ముందు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఉంటే.. అవి పాత ప్రాజెక్టులా.. కొ త్తవా.. అనేది తెలిసేదని అధికారులు, ఉద్యోగులు విస్మయం వ్యక్తంచేసినట్టుగా సమాచారం.

పూర్తి డీపీఆర్‌కు ఒప్పందం?

విజయక్రాంతి కథనంలో తెలిపిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై పూర్తి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కోసం కొద్ది రోజుల క్రితమే ఒప్పందం కుదిరినట్టుగా జెన్‌కో అధికారవర్గాల నుంచి అందిన సమాచారం. ఈ ఐదు ప్రాజెక్టులపై డీపీఆర్ తయారు చేయడానికి సంబంధించి వివిధ సంస్థలతో ఒ ప్పందం కుదిరిందని, ఆయా సంస్థలు త్వరలోనే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డీపీ ఆర్ తయారుచేసి... తరువాత ప్రజాభిప్రా యసేకరణకు, ఆపై సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీకి డీపీఆర్‌లను పంపిస్తారని ఓ అధికారి తెలపడం గమనార్హం.

అంటే అవి పాత ప్రా జెక్టులే కనుక.. కొద్ది రోజుల ముందే డీపీఆర్ తయారీకి అధ్యయన సంస్థలతో ఒప్పందం కుదిరింది. అదే ప్రభుత్వం ప్రకటించినట్టుగా సోమ, మంగళ వారాల్లో కుదుర్చుకున్న ఎం వోయూ ప్రాజెక్టులు అయితే.. ఇంత తొందరగా డీపీఆర్ తయారీకి సంస్థలతో ఒప్పం దాలు ఎలా చేసుకోగలుగుతాయి.. పైగా సెం ట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ వెబ్‌సైట్‌లో కంపెనీల పేర్లతో సహా ఎందుకు డెవలపర్లుగా కనపడుతాయి అంటూ అధికారుల్లోనే గుసగుసలు నడిచాయి. మొత్తానికి పాత ప్రాజె క్టులు, పాత కంపెనీలతోనే.. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడంపై సర్వత్రా చర్చనీ యాంశం అయ్యింది. 

అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే..

తాజాగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్-2025లో జరిగిన ఎంవోయూలకు సంబంధించి అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగిందని, దీనివల్లనే ఆయా శాఖలకు, ఉన్నతాధికారులకు ఎలాంటి సమచారం లేదని ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘విజయక్రాంతి’ దినపత్రికలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై వచ్చిన కథనం.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చకు దారితీసినట్టు తెలుస్తోంది. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరగడంతో.. ప్రాజెక్టులపై ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేదని, విషయం తెలిసిన తరువాత నోరెళ్లబెట్టాల్సి వచ్చిందని పలువురు ఉద్యోగులు, అధికారులు అనుకుంటున్నారు.