calender_icon.png 22 September, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ విద్యార్థి గృహంలో నేత్ర వైద్య శిబిరం

21-09-2025 11:50:23 PM

ఎల్బీనగర్ : ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలో అనాథ విద్యార్థులకు ఆదివారం కొత్తపేటలో ఉన్న మ్యాక్స్ విజన్ కంటి దవాఖాన సిబ్బంది ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అనాథ విద్యార్థి గృహంలో  ఉన్న 110 మంది  విద్యార్థులకు ఉచిత కళ్ల పరీక్షలు చేశారు. 32 మంది విద్యార్థులకు కళ్ల చూపు సమస్యలు ఉన్నాయని  నిర్ధారణ చేశారు. 13 మంది విద్యార్థులకు మళ్లీ కొత్తగా పరీక్షలు చేయాలని వైద్యులు సూచించారు. వైద్య పరీక్షల అనంతరం అందరికీ ఉచితంగా కళ్ల అద్దాలు ఇస్తామని హాస్పిటల్ సిబ్బంది హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్,  అడ్వైజరీ చైర్మన్ శశి మోహన్,  కౌన్సిలర్ రవితేజ, వైద్యులు సరిత, మాగ్నోలియాస్ ఎండీ సింగం శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.