calender_icon.png 22 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన దేశ భవిష్యత్‌ను కాపాడుకోవాలి

22-09-2025 12:48:38 AM

-డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలి

-2047 నాటికి భారత్‌నునంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి

-కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

-బీజేవైఎం ఆధ్వరంలో భారీ ర్యాలీ

-నమో యువ ౩కే రన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలనే గొప్ప సంకల్పంతో యువతను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినో త్సవాల్లో భాగంగా, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్య సాధన కోసం రాష్ర్ట బీజేపీ, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యం లో ఆదివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నమో యువ 3కే రన్‌ను నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద వేలాది మంది యువతతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించి స్వ యంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదిన ఉత్సవాల్లో భాగంగా నశాముక్త్ భారత్ లక్ష్యంతో యు వతను చైతన్యం చేసేందుకే ఈ 3కే రన్ నిర్వ హిస్తున్నాం. అత్యధిక యువత, యువ మేధ స్సు కలిగిన మన దేశ భవిష్యత్తును రక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, అని అన్నారు.

శక్తివంతమైన యువత మేధస్సు తోనే ప్రపంచాన్ని శాసించగలమని, ఆ శక్తి మన భారత యువతకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్న దుస్థితిని చూస్తు న్నాం. ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికడితే మన దేశానికి, మన యువత మేధస్సుకు తిరుగుండదు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా నిలపా లన్న ప్రధాని మోదీ కల సాకారం కావాలం టే, ఈ దేశం నుంచి డ్రగ్స్‌ను తరిమికొట్టా ల్సిందే, అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ అంది స్తున్న అవినీతి రహిత పాలనతో కుంభకో ణాలమ యమైన దేశం నేడు వికసిత భారత్ దిశగా పురోగమిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. యువత డ్రగ్స్, మద్యం వంటి దురల వాట్ల కు దూరంగా ఉంటూ, స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ర్ట బీజేపీ అధ్య క్షుడు, రాజ్యసభ సభ్యులు డా. ఎన్. రామ చందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.