12-08-2025 11:26:52 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్(Ramakrishnapur Police Station) పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి మంచిర్యాల-నాగ్ పూర్ జాతీయ రహదారి బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయ సమీపంలో దేవపూర్ కు వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉండగా మంచిర్యాల నుండి బెల్లంపల్లి వైపుకు వెళ్తున్న గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు లారీ వెనుక వైపున ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే మంచిర్యాల పట్టణంలోని ఓ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై రాజశేఖర్ తెలిపారు.