calender_icon.png 13 December, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయిజ పరిధిలో నేటితో ముగియనున్న ప్రచారపర్వం

12-12-2025 12:05:32 AM

గెలుపుపై ఎవరి ధీమా వారిది ? 

అయిజ, డిసెంబర్ 11: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ప్రచారం ఈరోజే చివరి రోజు ఎన్నికల సందడిలో ప్రచారాలు వ్యవధి తక్కువగా ఉన్న, నువ్వా నేనా అన్నట్టు ప్రచారాలు పోటాపోటీగా జరిగాయి. గెలుపు ఎవరిని వరించునో అని ఉత్కంఠంభరితంగా అభ్యర్థులు ఆలోచనలు తిరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో పోటీలో ఉన్న అభ్యర్థులు రాత్రి పగలు తేడా లేకుండా, ప్రచారంతో కుస్తీ పట్టి అభ్యర్థుల మనసులు గెలుచుకోవడం పై దృష్టి సారించారు.

రెండవ విడత చివరి అంకం 14వ తేదీ సాయంత్రం వారి వారి భవితవ్యం తేలనుంది. మాది గెలుపు అంటూ మాదే గెలుపు అంటూ ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తూ, ఒకవైపు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూనే లోలోపల భారీగా ఖర్చు పెట్టాం, విజయం ఎవరిని వివరిస్తుందో అని ఆలోచనలు కూడా వెంటాడుతున్నాయి.

మొదటి విడత ఫలితాలు రెండో విడత ఎలక్షన్లపై ప్రభావితం చూపే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి రెండో విడత బరిలో ఉన్న అభ్యర్థులు ఒకింత మొదటి విడత ఫలితాలపై దృష్టి సారించడం జరిగింది. ఏది ఏమైనా రెండో విడత పోటీదారులకు ఉత్కంఠత నెలకొన్నది.ఎవరు పీఠంపై కూర్చుంటామో అన్న దిగులు వెంటాడుతోంది.