calender_icon.png 17 December, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

10-12-2025 12:00:00 AM

సర్పంచ్ అభ్యర్థి పంబాల లచ్చయ్య 

మల్యాల,డిసెంబర్‌౯ (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని సర్వపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని పంబాల లచ్చయ్య హమీ ఇచ్చారు. ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలలో భాగంగా సర్వాపూర్ గ్రామం కు రిజర్వుడు జనరల్ రిజర్వుడు కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో ఉన్నాని అన్నా రు. గ్రామ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. గ్రామానికి అవసరమైన మంచి పనులు చేసేందుకు కృషి చేస్తానని, నిరంతరంగా అందుబాటులో ఉంటానని తెలిపారు.

గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం. మురికి కలు వ ల నిర్మాణానికి, మంచి నీటి సమస్యతో పాటు అన్ని మౌళిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. నేను గత పది ఏళ్ళగా  పంచాయతీ వార్డు సభ్యులుగా పని చేసి, గ్రామాభివృద్దికి కృషి చేశానని అన్నారు. నేను గ్రామంలో చేసిన పనులు తో అందించిన స్పూర్తితో ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు.గత 10 సంవత్సరాలుగా అధికార పార్టీలో పదవులు అనుభవించి, ప్రజలు కు పనిచేసిన పనులను ఉన్నాయి. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేసే,తనను గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనికోరారు.