12-05-2025 02:57:51 AM
కరీంనగర్, మే 11 (విజయ క్రాంతి): పార్టీ అధికారంలో లేనప్పుడు కష్ట కాలంలో జెండా మోసిన పార్టీ జెండా మోసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేము ప్రతిపాదించిన వాటికి నిధులు కేటాయించాలని,సంక్షేమ పథకాల అమలులో భాగస్వాములను చేయాలని కోరారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ లను కలిసి వినతి పత్రాలు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని, పోటీకి సిద్ధంగా లేనివారికి నామినేటెడ్ పదవులు ఇప్పించాలని కోరారు.