calender_icon.png 20 May, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్వో, ఎంపీడీవో కావలెను!

20-05-2025 12:00:00 AM

-ఇసుక మాఫియాతో అధికారుల్లో భయం

-గతంలో పని చేసిన అధికారులకూ బెదిరింపులు

-కోటగిరి, పోతంగల్లో పనిచేయాలంటే వణుకు

కామారెడ్డి, మే 19 (విజయ క్రాంతి), ఒకప్పుడు ఆ మండలాలకు అధికారులు వచ్చేందుకు ఎంతో పోటీపడేవారు. ప్రస్తుతం అక్కడ రివర్స్ అయింది.  అక్కడ జరిగేదంతా ఇసుక మాఫియా ఆగడాలు జోరుగా సాగడమే అధికారులకు శాపంగా మారింది.

మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న కోటగిరి, పోతంగల్ మండలాల్లో పరిసర గ్రామాల పరిధిలోని మంజీరా నది నుంచి ఇసుక మాఫియా బకాసురులు రెచ్చిపోయి అక్రమంగా ఇసుకను నిత్యం తరలిస్తున్నారు. అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బహిరంగంగానే అధికారుల కు బెదిరింపులు రావడంతో అధికారులు ఆ మండలాల్లో విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు వినాలని ఆదేశాలు ఒకవైపు మరోవైపు స్థానిక ప్రజా ప్రతినిధులు ఇసుక మాఫియా బడా బాబుల బెదిరింపులు ఉండడంతో ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియక తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని బదిలీపై వెళ్లారు. పనిచేయడానికి వచ్చేందుకు జంకుతున్న అధికారులు  కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు, పోతంగల్, కోటగిరి మండలాల్లో మండల స్థాయి అధికారులు అక్కడ పనిచేసేందుకు రావడానికి జంకుతున్నారు.

గతంలో డబ్బులు పెట్టి వచ్చేవా  గతంలో డబ్బులు పెట్టి తాసిల్దారుగా, ఎంపీడీవో, ఎస్త్స్రలుగా కోటగిరి, పోతంగల్, బీర్కూర్ మండలాలకు అధికారులు వచ్చేవారు. ప్రస్తుతం ఆ మండలాలకు అధికారులు రాక సీన్ రివర్స్ గా మారింది. వైపు అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, మరోవైపు ఉన్నతాధికారుల టార్గెట్లు, మరోవైపు ఇసుక మాఫియా దందా నిర్వాహకుల బెదిరింపులతో అధికారులుగా రావాలంటే జంకుతున్నారు.

ఇసుక మాఫియా వారి బెదిరింపులకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాల్సి ఉండడంతో స్థానికంగా ఉన్న ఇసుక మాఫియా, రాజకీయ నాయకులు కొందరు ఇసుక దందాలు దర్జాగా నిత్యం కొనసాగిస్తున్నారు.

అనుమతులు లేకుండానే ఆక్రమ ఇసుక దందా  అనుమతులు లేకుండానే మంజీరా నది నుంచి పోతంగల్, కోటగిరి, బీర్కూర్, పుల్కల్, డోంగ్లి, మండలాల పరిధిలోని గ్రామాల నుంచి లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్రుల ద్వారా మంజీర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి పగలు 

అనే తేడా లేకుండా ఇసుక మాఫియా దందా నిర్వాహకులు హైదరాబాద్, మహారాష్ట్ర కర్ణాటక, ప్రాంతాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు, టిప్పర్రు, ట్రాక్టర్లు ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మాఫియా ఆగడాల కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన ఉన్న అధికారులు  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో మంజీర పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక దందా ను అరికట్టాలని ఉద్దేశంతో బోధన్ సబ్ కలెక్టర్ మహంతి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి కలెక్ట ఆశిష్ సంగు  వాన్ లు పగడ్బందీగా అక్రమ ఇసుక దందాకు చెక్ పెట్టాలని భావించారు.

గతంలో పనిచేసిన తాసిల్దార్లు, ఎంపీడీవోలు అక్రమ ఇసుక నియంత్రణ చేసేందుకు చొరవ తీసుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. దీంతో  అక్రమ ఇసుక దందా నిర్వహిస్తున్న ఇసుక మాఫియా  అధికారులను చంపేస్తామని బెదిరింపుల కు గురి చేశారు. అప్పట్లో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి.

ఉన్నతాధికారులు బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన తహసిల్దార్లు ఎంపీడీవోలు బదిలీపై వెళ్లారు. ప్రాణాలైనా కాపాడుకుందాం అనే ఉద్దేశంతో బదిలీలు చేసుకొని వెళ్లిపోయారు. తాసిల్దారులు, ఎంపీడీవోలు, గా పని చేసేందుకు కోటగిరి, పోతంగల్ మండలాలకు అధికారులు రావడంలేదని స్థానికులు వాపోతున్నారు.

జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని అధికారులను నియమించాలని కోరుతున్నారు. అక్రమ ఇసుక దందా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే అధికారులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. లేకుంటే ఇన్చార్జిలతోనే కాలం వెలదీయాల్సి వస్తుందంటున్నారు.

అసలే కళాశాలలు, స్కూలు ప్రారంభం సమయానికి పిల్లలకు కులం, ఆదాయం సర్టిఫికేట్ లు అవసరం ఉంటాయని ఇన్చార్జి లు ఉండడంవల్ల సర్టిఫికెట్ల పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడతాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు స్పందించి పోతంగల్ ,కోటగిరి మండలాలకు తాసిల్దార్లను ఎంపీడీవోలను పర్మినెంట్గా నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

ఎంపీడీవోలు లేక ఎం పి ఓ లు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. పోతంగల్ తాహసిల్దార్ లేకపోవడంతో కోటగిరి తా హసిల్దార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కోటగిరి, పోతంగల్ మండలాలకు ఎంపీడీవోలు లేరు. ఎంపీఓ లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోటగిరి, పోతంగల్ మండలాలకు పర్మినెంట్ తాసిల్దార్లను ,ఎంపీడీవోలను నియమించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.