26-09-2025 08:21:01 PM
మిడ్జిల్: మీ పిల్లలకు బాధ్యతలు కూడా చెప్పవలసిన అవసరం ఉందని బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని శుక్రవారం ప్రిన్సిపల్ తిరుపతయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి మాట్లాడుతూ... తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను కళాశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పంపించాలనీ విద్యార్థులు ప్రతిరోజు కళాశాలలో అధ్యాపకులు బోధించిన అంశాలను ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులతో తెలియజేసి ఇంటి దగ్గర రాత్రి 10 గంటల వరకు చదువుకోవాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్నారా లేదా అనేది గమనించాలి. ఇంటర్మీడియట్ అనేది యుక్త వయసులో ఉండే పిల్లలను వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మార్పులు అనేటివి జరుగుతుంటాయి కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన క్రమంలో ఉండేటట్లుగా పెద్దలను గౌరవించేటట్లుగా తోటి విద్యార్థులతో స్నేహభావంతో నిలిగేటట్లుగా తీర్చిదిద్దాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.
విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొరకు ఎంసెట్ నీటి లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాలను బాధలను అర్థం చేసుకొని వారికి ఉన్నత స్థానాలకు వెళ్లడానికి తీర్చిదిద్దుకోవాలి. కళాశాలలో అధ్యాపకులు బోధించిన అంశాలను క్షుణ్ణంగా చదువుకోవాలి. విద్యార్థులు మంచిగా చదువుకొని కాలేజీకి అధ్యాపకులకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని వారు అన్నారు.