26-09-2025 08:15:54 PM
సుల్తానాబాద్,(విజయకాంతి): శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు, దుర్గాదేవి మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. పూజారి ఉప్పుల మల్యాల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమం లో కరీంనగర్ పాల డైరీ చైర్మన్ రాజేశ్వరరావు దంపతులు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రైతుబంధు సమితి పెద్దపల్లి మాజీ జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డిలు వేరువేరుగా హాజరై పూజలు నిర్వహించారు. విగ్రహ దాత అన్నప్రసాద వితరణ దాత పోగుల సరోజన రాజయ్య దంపతులు , వారి కుమారుడు అనిల్ లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.