18-11-2025 10:28:15 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రాంజీ గోండు ఆవాసం విద్యార్థులకు మంగళవారం రాత్రి పద్మశాలి సభ్యులు, ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు చలి దుప్పట్లను అందజేశారు. తీవ్రమైన చలి కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని వారికి దుప్పట్లను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. పద్మశాలి సభ్యులు హనుమాండ్ల రమాదేవి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల చిన్నచిన్న అవసరాలను తీర్చేందుకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు.
రాంజీ గోండు ఆవాస విద్యార్థులకు శిశుమందిర్ పాఠశాల అందిస్తున్న విద్య ఆధారంగా సంఘంలో చిన్నప్పటినుండే మంచి గుర్తింపు వస్తుందన్నారు. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పిస్తూ రాంజీ గోండు ఆవాసం నిర్వాహకులు తిరుపతి చేస్తున్న సేవలను వారు కొనియాడారు. తాటిపాముల శారద సత్యనారాయణ, విజ్ఞ సాయి, చిదిరాల శ్రీలత ఉమా ప్రసాద్, శేషు లు విద్యార్థులకు దుప్పట్లను అందించి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు.