18-11-2025 10:26:55 PM
ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి..
ఇబ్రహీంపట్నం: మొబైల్ షాపులు పోలీసుల సూచనలు పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించాలని ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్ లో ఇబ్రహీంపట్నం మొబైల్ యాక్సెసరీస్ ఎలక్ట్రానిక్స్ షాపు ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం, అసోసియేషన్ అధ్యక్షులు నాయిని మహేష్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై నాగరాజు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి వ్యాపారంలో వ్యాపారస్తులు, వివిధ షాపుల యజమానులు సంఘాటీతంగా ఉండడం అవసరమన్నారు. ఇబ్రహీంపట్నం మొబైల్ ఆక్సిసిరీస్, ఎలక్ట్రానిక్స్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయామని, మొబైల్ షాప్ సమస్యలఫై పోలీసుల సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలిపారు.
ఒకరి ఆధార్ కార్డుఫై ఆ వ్యక్తికి తెలియకుండా వేరొకరికి అదే ఆధార్ కార్డుతో సిమ్ కార్డును కొంతమంది షాప్ఓనర్స్ డబ్బుకు ఆశపడి ఇవ్వడం జరుగుతుందని, ఆలా చేస్తే షాప్ యజమాని సైతం బాద్యులు అవుతారని హెచ్చరించారు. దొంగ ఫోన్లను సైతం మొబైల్ ఫోన్ షాప్స్ యజమానులు లాక్ తీయడం, మొబైల్ నుండి అమౌంట్ డ్రా చేసి ఇవ్వడం, షాప్ యజమానులు తెలియకుండనే సర్వీస్ ఇవ్వడం జరుగుతుందని ఇలాంటివి చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సూరమోని సత్యనారాయణ, చెరుకూరి మహేందర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రావుల యాదగిరి, విద్యాసాగర్ జనరల్ సెక్రెటరీ ఎండి సజద్ ట్రెజరీ రాము పలు షాపుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.