calender_icon.png 18 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో మహిళా సంఘాల కీలక పాత్ర..

18-11-2025 10:23:26 PM

ఎమ్మెల్యే పాయల్ శంకర్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటినీ నిర్మాణం చేసుకోవడంలో మహిళా సంఘాల సభ్యుల పాత్ర చాలా కీలకమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ రాజు తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు లేకుంటే మహిళ సంఘాల నుండి కొంత డబ్బులు అందించే బాధ్యత మహిళా సంఘాల సభ్యులపై ఉందని అన్నారు. బైట ఉద్యోగాలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని, అందుచేతనే ఉద్యోగం వచ్చిన మీరు విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరుపేదలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఎలాంటి రాజకీయాలు లేకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అబివృద్ధి కోసం తాను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లను ఎన్నోసార్లు కలిసి సమస్యలను విన్నవించడం జరిగిందని వివరించారు.