calender_icon.png 18 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా పట్టా భూములు కాపాడండి మహా ప్రభో..??

18-11-2025 10:20:03 PM

మా పట్టా భూములలో అక్రమ ఇసుక తవ్వకాలు..?

మంగపేట (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో రమణక్కపేట రెవిన్యూ గ్రామం పరిధిలో మా పూర్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన భూములలో రమణక్కపేట గిరిజన సొసైటీ అయిన కొమరం భీమ్ ఎస్టీ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 125 /టీఎం రమణక్కపేట వారు గవర్నమెంట్ వారు సూచించినటువంటి పరిధిలో కాకుండా మా పట్టా భూములలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటి అని మా రైతుల అందరం కలిసి అడగడానికి వెళ్తే మాపై దాడులకు పాల్పడి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి పరిధిలో కాకుండా మా పట్టా భూములలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ వారు రమణక్కపేటలో గిరిజన కుటుంబాలతో పాటు అన్ని కులాలకు సంబంధించిన కుటుంబాలు కూడా పని కల్పించాలని ఉద్దేశంతో లేబర్ తో టాక్టర్ లో నింపి ఇసుకని స్టాక్ పాయింట్ లో పోసి స్టాక్ పాయింట్ నుండి టీజీఎండీసీ వారు వ్యాపార లావాదేవీలు జరుపుకునే విధంగా పర్మిషన్ ఇస్తే అట్టి పర్మిషన్లని లెక్కచేయకుండా వాళ్ల ఇష్టానుసారంగా పెద్దపెద్ద యంత్రాలతో మా పట్టా భూములలో ఇసుక 30 లేదా40 అడుగుల లోతుతో బారి భారీ నుంచి అతి భారీ యంత్రాలతో ఇసుక తీస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా పూర్వం నుంచి మాకు వారసత్వంగా సంక్రమించిన భూములు మాకు కాకుండా పోతే మా వంద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వాటిల్లుతుంది.

ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకొని గవర్నమెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ల వారు సర్వేలు చేసినటువంటి పరిధిలోనే ఇసుక తవ్వకాలు జరపాలని మేమందరం కోరుచున్నాము రమణక్కపేట భూములు కోల్పోతున్న రైతులు, ఇట్టి కార్యక్రమంలో చింతలపెళ్లి సాంబశివరావు, పెద్ద బోయిన ముకుందరావు, మునిగల కృష్ణమూర్తి. కంపేర్ల దయాకర్, మంచెర్ల నరహరి, మాచర్ల చందర్రావు, తోకల జోజబాబు, గుమ్మల శ్రీనివాసరావు, తోకల పెద్దబాబు వారిని అడ్డుకున్నారు.