calender_icon.png 18 November, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య..

18-11-2025 10:16:47 PM

ఉప్పల్ (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ రామంతపూర్ లో నివాసం ఉంటున్న బుచ్చమగారి వీరేష్ గౌడ్(40) వృత్తిరీత్యా పాన్ షాప్ నడుపుతున్నాడు. భార్యా పిల్లలతో ఆనంద్ నగర్ లో నివాసముండే వీరేశం గౌడ్ ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబం నడపడం కోసం తెలిసిన వారి వద్ద దాదాపు పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తను నడుపుతున్న పాన్ షాప్ కూడా ఇటీవల కాలంలో సరిగా వ్యాపారం లేకపోవడంతో అప్పును తీర్చలేక మనస్తాపం చెంది హాల్లోని బట్టలను తలిగించే హాంగర్ కు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన భార్య సుజాత చుట్టుపక్క వాళ్ళని పిలిచి హాస్పిటల్ తీసుకొని వెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్ల ఉప్పల్ పోలీసులు తెలిపారు.