18-11-2025 10:43:21 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎరుకల శ్రీనివాస్ కు బైపాస్ సర్జరీ కావడంతో మంగళవారం రాత్రి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ కాల్ టెక్స్ ట్ లో ఉంటున్న శ్రీనివాస్ ను పరామర్శించారు. ఎరుకల శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మంత్రి వివేక్ ను శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు మంత్రిని సన్మానించారు.
గడ్డం వివేక్ కు మంత్రి పదవి వస్తే ముస్లిం మైనార్టీ తరఫున పేదలకు అన్నదానం చేస్తానని మొక్కిన మైనార్టీ నాయకులు అంజాద్ బాయ్ మంత్రి వివేక్ సమక్షంలో అల్లాకు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి సదానందం, మునిమంద రమేష్, బండి ప్రభాకర్, నెల్లి రమేష్, చెప్ప మనోహర్, కాసర్ల యాదగిరి, కుంభాల రాజేష్, వేల్పుల రాజేందర్, సబ్బని రాజనర్సు, శ్రీనివాస్, పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.