calender_icon.png 18 November, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

290 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

18-11-2025 10:14:25 PM

పటాన్ చెరు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నమ్మకమైన సమాచారం మేరకు పటాన్చెరు పోలీసులు ఇస్నాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జేజే03 బీవీ 9952 నంబరు గల వాహనంలో పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. సుమారు 290 క్వింటాళ్ల బియ్యం లభించినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్డార్ అనూప్ దేవానంద్ ఫిర్యాది మేరకు లారీ యజమాని జలకేసరి సింహ్ జయవీర్ సింహ్, లారీ డ్రైవరు నారాబాయిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్చెరు పోలీసులు తెలిపారు.