18-11-2025 10:53:58 PM
శంషాబాద్ (విజయక్రాంతి): సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్దులపై ర్యాగింగ్ పాల్పడ్డారు. ఇరువురు విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తతలకు దారీ తీసింది. ఈ సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే శంషాబాద్ లోని మెటా మైండ్ అకాడమీలో మంగళవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడ్డారు. ర్యాగింగ్ ను ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా జూనియర్ (ఫస్ట్ ఇయర్) విద్యార్థులతో సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడులకు దిగారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
ఈ దాడుల్లో కొందరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గాయాలాయ్యాయి. హాస్టల్ విద్యార్దులపై డెస్ కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్ తో ఈ దాడికి యత్నించినట్లు తెలిసింది. విషయాన్ని తెలుసుకొన్న శంషాబాద్ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురి తల్లిదండ్రులను పిలిపించిన కళాశాల యాజమాన్యంతో చర్చించి సిసి కెమెరాల్లో రికార్డయిన విద్యార్దుల ఘర్షణ వీడియోలు పరిశీలిస్తున్నారు. కళాశాల వార్డెన్ పిల్లలకు సిగరేట్లు సరఫరా చేస్తునట్లు అరోపణలున్నాయి. ఈ కళాశాలకు ఏలాంటి అనుమతులు లేవని, తరచు ఈ కళాశాలలో ఇలాంటి గోడవలు జరుగుతాయని స్థానికుల ఆరోపిస్తున్నారు. విద్యార్దుల ఘర్షణపై పోలీసులు అరాతీస్తున్నారు. ఇదీలా ఉండగా కేవలం గొడవ మాత్రమే జరిగిందని, ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని ఏర్పోర్ట్ పోలీస్ పోలీసులు చెబుతున్నారు.