25-09-2025 11:52:07 PM
ఎల్బీనగర్: జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో గురువారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఉత్సవాలకు సరూర్ నగర్, హయత్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేటర్లు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు, కార్పొరేటర్లు, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు.
బతుకమ్మ ఆటపాట లతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆర్కేపురం, హస్తినాపురం, నాగోల్ డివిజన్ల కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి, సుజాత నాయక్, చింతల అరుణా సురేందర్ యాదవ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. వీరితోపాటు సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు బతుకమ్మ ఆడుతూ మహిళలను ఉత్సాహపరిచారు. బతుకమ్మను గొప్పగా నిర్వహించుకుంటూ తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకెళుతున్నామని కార్పొరేటర్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు.