calender_icon.png 26 September, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

26-09-2025 12:13:22 AM

ఇబ్రహీంపట్నం: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గురువారం విలేకరుల సమావేశంలో మంచాల సీఐ మధు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆగపల్లి రోడ్డుపై పోలీసు సిబ్బందితో  వాహన తనిఖీలు చేస్తుండగా ఆగపల్లి బస్టాప్ వద్ద ఓ వ్యక్తి బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించడంతో, బ్యాగును తనిఖీ చేశామని అన్నారు. అందులో 1కేజీ నిషేధిత గంజాయి లభ్యమైందని, దీని విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని తెలిపారు. నిందితుడు ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ప్రమోద్ కుమార్ నిశాత్ (19), వృత్తిరీత్యా మేస్త్రి అని తెలిపారు. నిందితుడి నుండి 1కేజీ గంజాయి, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని, పూర్తి విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.