26-09-2025 12:06:22 AM
తొలి ప్రయత్నంలోనే విజయతీరాలకు
డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన దొంత నిశ్రిత
మెదక్,(విజయక్రాంతి): సాధించాలనే తపన, పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని మెదక్ కు చెందిన దొంత నిశ్రిత నిరూపించింది. టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ తీసుకున్న ఆమె టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాసి 502.5 మార్కులతో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. డీఎస్పీ ఉద్యోగం సాధించడంపై నిశ్రితకు కుటుంబ సభ్యులు, బంధువులు, పట్టణవాసులు శుభాకాంక్షలు తెలిపారు.
నిశ్రిత కుటుంబ నేపథ్యం..
మెదక్ పట్టణానికి చెందిన దొంత నరేందర్, శిరీష దంపతులకు నిశ్రిత ఏకైక కుమార్తె. తండ్రి నరేందర్ నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులుగా పని చేస్తుండగా.తల్లి శిరీష గృహిణి.
విద్యభ్యాసం..
నిశ్రిత ఆరో తరగతి వరకు హైదరాబాదులోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్, పదో తరగతి వరకు మెదక్ గీతా హై స్కూల్ లో, హైదరాబాద్ లోని నారాయణ ఐఎఎస్ అకాడమీలో ఇంటర్, ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ తీసుకున్న ఆమె తొలి ప్రయత్నం లోనే విజయతీరాలకు చేరింది.