calender_icon.png 26 September, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో రెడ్డి సేవ సంఘం అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

26-09-2025 12:00:36 AM

వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని రెడ్డి సేవ సంక్షేమ సంఘం అధ్వర్యంలో గురువారం  బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి భవనంలో భారీ బతుకమ్మ ను ఏర్పాటు చేసిన ఈ  వేడుకల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రాముఖ్యమైందని, ఈ పండుగను మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారని వారందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.