26-09-2025 12:17:23 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా లోకల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే కులగణన చేపట్టి, దాని ఆధారంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి ఆమోదం ఆలస్యమవుతుండటంతో ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపి నా అది ఫలించలేదు.
సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించిన విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రత్యేక జీవోను రేపో మాపో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రెండు, మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం విధించిన గడువులోపు ఎన్నికల అసాధ్యమనే విషయం స్పష్టమవుతోంది.
పైగా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రత్యేక జీవోకు వ్యతిరేకంగా పలువురు పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టు సర్కార్ భావిస్తోంది. న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఇదే అంశాన్ని కోర్టుకు నివేదించాలని భావిస్తోంది. అప్పు డు ఎన్నికలు నిర్వహణ నిర్ణయం మళ్లీ హైకోర్టు పరిధిలోకే వెళ్లే అవకాశం ఉన్నట్టు సర్కార్ యోచిస్తోంది. హైకోర్టు తీసుకొనే నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై సందిగ్ధం వీడనున్నది.
ప్రభుత్వానికి అనుకూలమే..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అడ్డుకోవాలని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే వారు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను కారణంగా చూపుతూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జీవో వెలువడిన తర్వాత దాఖలయ్యే పిటిషన్లను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని జీవోపై అభ్యంతరం తెలిపినా దానిపై వాదించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
రిజ ర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మరో 10 శాతం అదనంగా పెంచేందుకు అవకాశం ఉన్నప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడ్డంకులు ఎందుకని బీసీ వర్గాలు కూడా వాదిస్తున్నాయి. దీంతోపాటు ఎంపరికల్ డేటా ఆధారంగా రిజ ర్వేషన్లు పెంచుకొనే అవకాశం ఉందని గతం లో వచ్చిన తీర్పులను ఉదాహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను హైకోర్టు కొట్టేసినా, పరిగణనలోకి తీసుకున్నా.. ఎదు ర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ట్టు తెలుస్తోంది. దీంతో బీసీ రిజర్వేషన్ అంశంతో ముడిపడిన స్థానిక సంస్థల ఎన్నికల చిక్కుముడికి పరిష్కారం లభించే అవ కాశం ఉంది.
హైకోర్టు నిర్ణయం పైనే ఎన్నికల నిర్వహణ..
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం విడుదల చేయబోతున్న జీవోకు వ్యతిరేకంగా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ప్రభుత్వం జీవో ఇవ్వకుండా, ఏ ఆధారమూ లేకుం డా, కేవలం వార్తా కథనాల ఆధారంగా విచారణ చేపట్టలేమనే కారణాన్ని చూపు తూ ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అయితే ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత కూడా ఈ రకమైన పిటిషన్లు దాఖలయ్యేందుకు అవకాశం ఉన్నది.
అలా జరిగితే రిజర్వేషన్ అమలు, స్థానిక ఎన్నికల నిర్వహణ అంశం హైకోర్టు పరిధిలోనే ఉంటుంది. జీవోను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను హైకోర్టు స్వీకరిస్తే విచారణ జరిపేందుకు సమయం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విచారణ పూర్త య్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గడువు పొడగించాలని హైకో ర్టును కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.
ఇదిలా ఉండగా పిటి షన్లను హైకోర్టు స్వీకరించని క్రమంలో జీవో ద్వారా రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వానికి లైన్ క్లియర్ అవుతుంది. జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాని పక్షంలో వెంటనే నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహించే అవకాశం ఉంటుంది.