calender_icon.png 26 September, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రా పద్ధతిన రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపు

26-09-2025 12:16:56 AM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని 40 ఏ 4 మద్యం దుకాణాలకు డ్రా పద్ధతిన ఎస్.సి, ఎస్.టి, గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎక్సైజ్ శాఖ, జిల్లా షెడ్యూల్డ్ కులాల, జిల్లా వెనుకబడిన తరగతుల, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖల అధికారులతో కలిసి మద్యం షాపుల రిజర్వేషన్ సంబంధిత డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.

  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 40 ఏ4 మద్యం దుకాణాలలో రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎస్.సి లకు 1, 4, 18, 21, 28.       నంబర్లు గల దుకాణాలు, గౌడ కులస్తులకు   25 నంబర్లు గల దుకాణాలను,  రిజర్వేషన్ ప్రకారం డ్రా పద్ధతిన కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో 9 షాప్ లను ఎస్టీ కి కేటాయించడం జరిగిందన్నారు.