10-02-2025 01:13:18 AM
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
మహబూబ్‌నగర్, ఫిబ్ర వరి 9 (విజయక్రాంతి) : దైవభక్తి ప్రతి ఒక్కరిని సన్మా ర్గంలో నడిపిస్తుందని దేవర కద్ర ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మూసాపేట్ మండలంలో ని వేముల గ్రామంలో బీరప్ప స్వామి ఉత్సవాలలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భం గా బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరి సంక్షేమమే తమ కర్తవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు.