05-05-2025 02:03:23 AM
షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌లో ‘గోకులం సిగ్నేచర్ జువెల్స్’ సరికొత్త షోరూమ్‌ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతులమీదు గా ఆదివారం ప్రారంభించారు. తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉన్నదని నిర్వాహకులు పొత్తూరి సుబ్బారావు, పొత్తూరి లలితకుమా రి, బాబురావు చెప్పారు.
భారతీయ మహిళల స్కిన్ టోన్‌కు తగ్గట్టుగా సిల్వర్‌లో సరి కొత్త అధ్యయానికి నాంది పలికారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘గోకులం సిగ్నేచర్ జువెల్స్‘ షోరూంలో సిల్వ ర్ జ్యువెలరీ, లాబ్ గ్రోన్ డైమండ్స్, వివాహ వేడుకలు, అన్ని సందర్భాలకు ప్రత్యేక కలెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. షోరూమ్ నిర్వా హకులు మాట్లాడుతూ..“కూకట్‌పల్లిలో తమ షోరూమ్‌కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుం చి మాకు ప్రజలు మంచి పేరు తెచ్చి మమ ల్ని ఆదరిస్తున్నారు.
మేము మా కస్టమర్లకు నూతన మోడల్స్, నాణ్యత, మన్నికతో వెండి, వజ్ర ఆభరణాలను అందిస్తున్నాం” అని చెప్పారు. గాజులు, మంగళ సూత్రం, వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేక బ్రైడ ల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైన సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో షోరూమ్ వద్దకు చేరు కొని ఆమెను చూసేందుకు ఉత్సాహం చూపించారు.