05-05-2025 02:01:13 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ప్రపంచ ఆస్థమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘ప్రతి క్షణం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోండి’ పేరుతో రేపు ఉచిత ఆస్థమా అవగాహన, స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరం ద్వారా ప్రజల్లో ఆస్థమా గురించి అవగాహన పెంచాలని, వ్యాధిని తొందరగా గుర్తించి, చికిత్స ప్రారంభించేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముషీరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ శ్వాసకోశ నిపుణుడు (పల్మనాలజిస్ట్) డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అలీం మాట్లా డుతూ.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉచిత పల్మనాలజిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లు, ఉచిత పల్మన రీ ఫంక్షన్ టెస్టులు (పీఎఫ్‌టీ) అందించబడతాయని చెప్పారు. ఆస్థమా లక్షణాలు ఎలా గుర్తించాలి, సాధారణ కారణాలను ఎలా నివారించాలి, చికిత్స ఎలా తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.
భారతదేశంలో సుమారు 3.5 కోట్ల మందికి పైగా, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మందికిపైగా ఆస్థమా ఉన్నదన్నా రు. దీన్ని సమయానికి గుర్తించకపోయినా సరైన చికిత్స తీసుకోకపోయినా జీవితం మీద చెడు ప్రభావం పడుతుందన్నారు. ప్రపంచంలో ఆస్థమా వల్ల జరిగే మరణాల్లో భారత్లో వాటా 42 శాతం ఉన్నదన్నారు. ఇన్హేలర్లను సరైన పద్ధతిలో ఉపయోగించి, చికిత్స తీసుకుంటే అత్యవసర హాస్పిటల్‌కు వెళ్లే అవసరం 60 శాతం తగ్గుతుందన్నారు.
అందుకే ఈ శిబిరం ద్వారా ప్రజల్లో అవగాహన పెం చాలని ఆశిస్తున్నామని చెప్పారు. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీస ర్ డాక్టర్ భారతి మాట్లాడుతూ.. ఆస్థమా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా దాన్ని మనం సరి గ్గా చూసుకుంటే నియంత్రించవచ్చు అన్నా రు. కుటుంబంలో ఆస్థమా చరిత్ర ఉన్నవారు లేదా తరచూ దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా ఈ ఉచిత శిబిరంలో పాల్గొనాలని కోరారు.