calender_icon.png 25 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు అండగా ఉంటా

25-09-2025 12:43:21 AM

  1. కల్వకుర్తికి దీటుగా ఆమనగల్లును అభివృద్ధి చేస్తా
  2. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు,సెప్టెంబర్ 24: ట్రిపుల్  ఆర్ భూనిర్వాసితులకు అధైర్య పడొద్దు అని తాను అండగా ఉంటానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలో మన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఆమనగల్లు మున్సిపాలిటీలో రూ. 32 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, నేడు రూ. 10 కోట్లతో మున్సి పాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని ఈ కార్యక్రమానికి  ఎంపీ  మల్లు రవి హాజరు కానున్నారని తెలిపారు.

ట్రిపుల్‌ఆర్ రోడ్డు గత ప్రభుత్వంలోనే  మంజూరు అయిందని , ప్రతిపక్షాలు  బిజెపి, బీ ఆర్‌ఎస్  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు  ఆటంకం కలిగించేందుకు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం దీటుగా  ఆమనగల్లును అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ఆయన హామీని చ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల సొంత భవనాలకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ శంకర్,పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ, జిల్లా నాయకులు గుర్రం కేశవులు, శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు జగన్, బిచ్య నాయక్, నాయకులు కృష్ణ నాయక్, శ్రీశైలం, బాబా, విజయ్, శ్రీనివాసులు, ప్రసాద్, నాసర్ తదితరులు పాల్గొన్నారు.